ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా స్టార్ హీరోలందరితో జోడీ కట్టిన మీనా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో అమ్మ, అత్త పాత్రల్లోనూ నటిస్తున్నారు. రీసెంట్గా ఈమె మలయాళంలో మోహన్‌లాల్ తో కలిసి జోడీగా నటించిన 'దృశ్యం2' చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడు 'దృశ్యం 2' తెలుగు రీమేక్‌లోనూ వెంకటేశ్‌తో జోడీ కట్టనుంది. అలాగే మరో సీనియర్ స్టార్ హీరోతోనూ మీనా కలిసి నటించనుందనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆ స్టార్ ఎవరో కాదు.. మంచు మోహన్‌బాబు. ఈయన టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'సన్నాఫ్ ఇండియా'. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మోహన్‌బాబు సరసన మీనా నటించనుందట.
ఇది వరకు వీరద్దరూ కలిసి 'అల్లరి మొగుడు, మామ మంచు అల్లుడు కంచు' సినిమాల్లో జంటగా నటించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రానికి స్వయంగా స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు.