‘మెడికవర్‌’లో రోగికి అరుదైన శస్త్ర చికిత్స

ABN , First Publish Date - 2020-10-23T10:45:45+05:30 IST

44 ఏళ్ల ఓ రోగికి కర్నూలు మెడికవర్‌ ఆసుపత్రి వైద్యులు అరుదైన లంగ్‌ డీకారికేషన్‌ సర్జరీ చేసి ఓ ప్రాణాన్ని కాపాడారు.

‘మెడికవర్‌’లో రోగికి అరుదైన శస్త్ర చికిత్స

కర్నూలు(హాస్పిటల్‌), అక్టోబరు 22: 44 ఏళ్ల ఓ రోగికి కర్నూలు మెడికవర్‌ ఆసుపత్రి వైద్యులు అరుదైన లంగ్‌ డీకారికేషన్‌ సర్జరీ చేసి ఓ ప్రాణాన్ని కాపాడారు. మహమ్మద్‌ షరీఫ్‌ అనే రోగి షుగర్‌ వ్యాధితోపాటు ఊపిరితిత్తులని కప్పి ఉంచే ప్లూరల్‌ లేయర్‌ సహా రైట్‌ లంగ్‌లో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఈ ప్లూరల్‌ లేయర్‌ ఒక వైపు దళసరిగా మారడంతో, ఊపిరి అందక విపరీతమైన నొప్పి వచ్చేది. దీన్ని గుర్తించిన మెడికవర్‌ ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేశారు.  ఈ సందర్భంగా ఆసుపత్రి కన్సల్టెంట్‌ కార్డియోథోరాసిక్‌ సర్జన్‌ డా.విశాల్‌ ఖండే పల్మనాలజిస్ట్‌ డా.వరప్రసాద్‌ మాట్లాడుతూ డీకారిటేషన్‌ అనేది  చాలా క్లిష్టమైన థొరాసిక్‌ ఆపరేషన్‌ అన్నారు. దీనిలో ఊపిరితిత్తుల నుంచి పైన పొర లేదా మెంబ్రెన్‌ వంటి  ఒక పైబ్రస్‌ కవర్‌ని  పూర్తి థొరాకాటమి చేసి తొలగించినట్లు తెలిపారు.  రోగికి అవసరమైన టెస్టులు అన్ని చేసినా తర్వాత దాదాపు 3 గంటలకు పైగా సర్జరీ చేశామని తెలిపారు.


Updated Date - 2020-10-23T10:45:45+05:30 IST