సుప్రీంకోర్టులో అజారుద్దీన్‌కు చుక్కెదురు

ABN , First Publish Date - 2021-10-22T00:15:14+05:30 IST

సుప్రీంకోర్టులో మాజీ టీమిండియా కెప్టెన్ అజారుద్దీన్‌కు చుక్కెదురైంది. ఇటీవల హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా అజార్‌ని అపెక్స్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది.

సుప్రీంకోర్టులో అజారుద్దీన్‌కు చుక్కెదురు

ఢిల్లీ: సుప్రీంకోర్టులో మాజీ టీమిండియా కెప్టెన్ అజారుద్దీన్‌కు చుక్కెదురైంది. ఇటీవల హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా అజార్‌ని అపెక్స్ కౌన్సిల్  సస్పెండ్ చేసింది. అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంపై అంబుడ్స్‌మెన్ దీపక్‌వర్మతో కలిసి అజార్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీపక్ వర్మ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. అపెక్స్ కౌన్సిల్ తరపు న్యాయవాది మరియు అజారుద్దీన్ తరపు న్యాయవాది వాదించిన వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ పదవి నుంచి అజారుద్దీన్ తొలగిపోవాల్సిందేనని కోర్టు తెలిపింది.

Updated Date - 2021-10-22T00:15:14+05:30 IST