న్యూఢిల్లీ: ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగులో ట్వీట్ చేశారు. ‘‘నైపుణ్యం, ధృడసంకల్పం, పట్టుదలకు ఏపీ ప్రజలు మారుపేరు... అందువల్లే అనేక రంగాల్లో రాణిస్తున్నారు.. ఏపీ ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు’’ మోదీ ట్వీట్ చేశారు.