హనుమాన్ గధీలో పూజలు చేయనున్న మోదీ

ABN , First Publish Date - 2020-08-02T20:41:28+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 5న అయోధ్యలో రామాలయ భూమిపూజలో పాల్గొనడానికి ముందు..

హనుమాన్ గధీలో పూజలు చేయనున్న మోదీ

అయోధ్య: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 5న అయోధ్యలో రామాలయ భూమిపూజలో పాల్గొనడానికి ముందు మార్గమధ్యంలోని ప్రఖ్యాత హనుమాన్ గధీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. 10వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో ఏడు నిమిషాల పాటు జరిగే ఈ కార్యక్రమంలో, మూడు నిమిషాల పాటు మోదీ ఆరోగ్యంగా ఉండాలని, దేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గాలని వేద పండితులు మంత్రాలు చదవనున్నారు. ఆశీర్వచనాలు అందజేయనున్నారు.


హనుమాన్ గధీ ప్రధాన పురోహితుడు మహంతి రాజు దాస్ ఈ విషయం తెలియజేస్తూ, ఏ మార్గం గుండా ప్రధాని లోపలకు అడుగుపెట్టాలనేది ఈరోజు నిర్ణయిస్తామని చెప్పారు. ప్రధాన మార్గంలో 85 మెట్లు, వెనుక వైపు నుంచి 36 మెట్లు ఉన్నట్టు తెలిపారు. సామాజిక దూరం నిబంధనలకు అనుగుణంగా నలుగురు పురోహితులు మాత్రమే మంత్రాలు చదువుతారని చెప్పారు. సామాజిక దూరానికి సంబంధించి పీఎంఓ నుంచి తమకు ఆదేశాలు వచ్చాయని, ప్రధానిని ముట్టుకోవడానికి కానీ, ప్రసాదం ఇవ్వడానికి కానీ ఎవరినీ అనుమతించడం లేదని మహంతి రాజు దాస్ తెలిపారు.

Updated Date - 2020-08-02T20:41:28+05:30 IST