Abn logo
Sep 24 2021 @ 17:06PM

America లో Modi బస చేసిన హోటల్‌‌ చరిత్ర ఇదీ.. 204 ఏళ్ల క్రితమే..

వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ.. మూడు రోజుల పర్యనటలో భాగంగా సెప్టెంబర్ 23న అమెరికాకు చేరుకున్నారు. మోదీ పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీలోని ఆండ్రూస్ జాయింట్ ఎయిర్‌ఫోర్స్ బేస్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న భారతీయులు.. జాతీయ పతాలకాలను చేబూని ఆయనకు స్వాగతం పలికారు. కాగా.. కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత ప్రధాని మోదీకి ఇది రెండో విదేశీ పర్యటన. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారిగా ప్రధాని మోదీ అగ్రరాజ్యాన్ని విజిట్ చేస్తున్నారు. మోదీ పర్యటనకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలను గమనిస్తే..


అమెరికా పర్యటనలో భాగంగా మోదీ బస చేసిన హోటల్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాని మోదీ వాషింగ్టన్‌ డీసీలోని బిలార్డ్ హోటల్ (Billard Hotel)లో బస చేశారు. దీనిని 204ఏళ్ల క్రితం.. అంటే 1816లో నిర్మించారు. ఆ తర్వాత ఈ హోటల్‌లో ఎన్నో మార్పులు చేశారు. 


ఈ హోటల్‌లో మొత్తం 9 సూట్లు ఉన్నాయి. వీటిలో క‌నీసం ఐదింట్లో దేశాధినేత‌లు అమెరికా పర్యటనకు వ‌చ్చిన‌ప్పుడు బ‌స చేస్తుంటారు. అబ్రహం లింకన్, జార్జ్ వాషింగ్టన్‌ పేర్ల మీద కూడా ఇందులో సూట్లు ఉన్నాయి. ఇందలో బస చేయాలంటే.. కొన్ని నెలల ముందుగానే బక్ చేసుకోవాల్సి ఉంటంది. అమెరికా సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ హోటల్‌లోని ఇంటీరియల్ ఉంటుంది.


ఈ హోటల్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రతి అంశాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో ప్రధాని మోదీ సమావేశం సందర్భంగా స్నిఫ్ఫర్ డాగ్స్‌తో భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు.


అమెరికా పర్యటనలో భాగంగా గురువారం రాత్రి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ని ప్రధాని మోదీ కలిశారు. భారతీయ అమెరికన్ అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించడంపట్ల మోదీ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా హారిస్‌కు మోదీ అభినందనలు తెలిపారు. 


ఐసన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్‌లో భారత ప్రతినిధి బృందం, యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మరియు యుఎస్ ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. 


మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన ప్రధాని.. తొలి రోజు బిజీ బిజీగా గడిపారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఐదు కంపెనీల సీఈఓలతో మోదీ విడివిగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. మోదీతో సమావేశమైన వారిలో శంతను నారాయణ్, వివేక్‌లాల్ కూడా ఉన్నారు. వీరిద్దరూ భారతీయ అమెరికన్లు కావడం విశేషం. 


గురువారం రోజు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో సమావేశమైన మోదీ..  ఆర్థిక, ప్రజల మధ్య పరస్పర సంబంధాల బలోపేతంపై ప్రధానంగా చర్చించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...