భారతీయుల ఆకాంక్షలకు విద్యార్థులే ప్రతినిధులు : మోదీ

ABN , First Publish Date - 2021-02-23T20:17:41+05:30 IST

కోట్లాది మంది ఆకాంక్షలకు విద్యార్థులు ప్రాతినిధ్యం వహించాలని

భారతీయుల ఆకాంక్షలకు విద్యార్థులే ప్రతినిధులు : మోదీ

ఖరగ్‌పూర్ :  కోట్లాది మంది ఆకాంక్షలకు విద్యార్థులు ప్రాతినిధ్యం వహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఐఐటీ ఖరగ్‌పూర్ స్నాతకోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ, ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి కృషి చేయాలని కోరారు. 


మోదీ మంగళవారం ఐఐటీ ఖరగ్‌పూర్ 66వ స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. 130 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు విద్యార్థులు ప్రాతినిధ్యం వహించాలని చెప్పారు. ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి విద్యార్థులంతా స్టార్టప్‌లుగా మారాలని తెలిపారు. 21వ శతాబ్దపు భారత దేశం మారిందని చెప్పారు. ఇప్పుడు ఐఐటీ అంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాదని, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండిజెనస్ టెక్నాలజీ అని వివరించారు. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం, స్వీయ అవగాహన, నిస్వార్థం ఉండాలన్నారు. 


‘‘130 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు మీరు ప్రాతినిధ్యంవహించాలి. ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి మీరంతా స్టార్టప్‌లుగా మారాలి’’ అని ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులను ఉద్దేశించి మోదీ చెప్పారు.


ఈ సందర్భంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌ను మోదీ ప్రారంభించారు. ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సహకారంతో ఐఐటీ ఖరగ్‌పూర్ ఏర్పాటు చేసింది. ఈ సంస్థను మోదీ కలలకు అనుగుణంగా ఏర్పాటు చేసినట్లు ఓ అధికారిక ప్రకటన వెల్లడించింది. సైన్స్, ఇన్నోవేషన్‌లో పెట్టుబడులతో, పరిశోధనలు చేసే ప్రతిభతో భారత దేశ భవిష్యత్తు రూపొందాలనే మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా టెక్నాలజీ, హెల్త్‌కేర్ సమ్మేళనంతో ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దినట్లు తెలిపింది. 




Updated Date - 2021-02-23T20:17:41+05:30 IST