సాగుకు చేవ.. రైతుకు రొక్కం

ABN , First Publish Date - 2020-10-25T09:36:00+05:30 IST

కేంద్రం ఇటీవల చేసిన వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాల్ని ప్రధాని నరేంద్ర మోదీ సమర్ధించుకున్నారు. ’ఇవి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తాయి. రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు...

సాగుకు చేవ.. రైతుకు రొక్కం

  • కొత్త వ్యవసాయ చట్టాల్ని సమర్థించుకున్న మోదీ


అహ్మదాబాద్‌, అక్టోబరు 24: కేంద్రం ఇటీవల చేసిన వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాల్ని ప్రధాని నరేంద్ర మోదీ సమర్ధించుకున్నారు. ’ఇవి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తాయి.  రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. దేశంలో వేలాదిగా రైతు ఉత్పత్తి సంస్థలు (ఎఫ్‌పీవో)లను ఏర్పాటుచేస్తున్నాం. నిలిచిపోయిన ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పూర్తి, వ్యవసాయ, పంటల బీమా పథకాల బలోపేతం... వీటన్నింటి లక్ష్యం ఒక్కటే- రైతు ఇకమీదట కష్టాలు పడకూడదు’’ అని ఆయన పేర్కొన్నారు. గుజరాత్‌లో వ్యవసాయ, ఆరోగ్య, పర్యాటక రంగాల్లో మూడు పెద్ద ప్రాజెక్టులను ఆయన శనివారంనాడు వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ప్రారంభించారు. ఆసియాలోనే అతి పెద్ద రోప్‌వే ప్రారంభం ఇందులో ఒకటి. గుజరాత్‌లోని జునాగఢ్‌ జిల్లాలో ఉన్న గిర్నార్‌ (గిరి నగర్‌) శిఖరం ప్రసిద్ధ హిందూ, జైన క్షేత్రాలకు నెలవు. 2.3 కిలోమీటర్ల పొడవున్న ఈ రోప్‌వే నిర్మాణానికి 130 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు.  1983 లోనే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగినా పర్యావరణ అడ్డంకుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. 2500 అడుగుల ఎత్తున ఉన్న అంబాదేవి ఆలయానికి భక్తులను ఈ రోప్‌వే తీసికెళుతుంది. ఏటా 7లక్షలమంది పర్యాటకులు గిర్నార్‌ సందర్శిస్తారని గుజరాత్‌ సర్కార్‌ అంచనా.


రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని దసరా శుభాకాంక్షలు

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాదేవి దీవెనలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.


Updated Date - 2020-10-25T09:36:00+05:30 IST