ప్రధానికి 13 వేల రూపాయల ఫైన్ వేసిన విషయాన్ని చెప్పిన మోదీ

ABN , First Publish Date - 2020-06-30T21:44:37+05:30 IST

న్యూఢిల్లీ: కరోనాపై ప్రారంభంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు కనపడిన భారతీయులు ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, అది తగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు.

ప్రధానికి 13 వేల రూపాయల ఫైన్ వేసిన విషయాన్ని చెప్పిన మోదీ

న్యూఢిల్లీ: కరోనాపై ప్రారంభంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు కనపడిన భారతీయులు ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, అది తగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. కరోనా విషయంలో ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్కు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పక పాటించాలన్నారు. ఓ దేశ ప్రధాని(బల్గేరియా ప్రధాని బొరిస్సోవ్) మాస్క్ పెట్టుకోలేదని 13 వేల రూపాయల ఫైన్ వేసిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. గ్రామీణుడికైనా, దేశ ప్రధానికైనా నిబంధనలు ఒకేలా ఉండాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనల విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు.




సకాలంలో లాక్‌డౌన్ విధించడం వల్ల లక్షలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడగలిగామని ప్రధాని చెప్పారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకోసం రానున్న ఐదు నెలల పాటు 5 కేజీల బియ్యం లేదా గోధుమలు, కిలో చక్కర ఉచితంగా పంపిణీ చేస్తామని మోదీ చెప్పారు.

Updated Date - 2020-06-30T21:44:37+05:30 IST