ISB వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2022-05-26T20:10:17+05:30 IST

ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ద్విదశాబ్ది ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

ISB వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ

హైదరాబాద్ సిటీ : ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ద్విదశాబ్ది ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ (Minister Talasani) హాజరయ్యారు. ఈ ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. అనంతరం 10 మందికి గోల్డ్‌మెడల్స్‌, పట్టాలు ప్రధాని అందజేయనున్నారు. ఆ తర్వాత ISB ఆవరణలో మోదీ మొక్క నాటనున్నారు. కాగా.. మొత్తం భాగ్యనగరంలో రెండున్నర గంటలపాటు మోదీ పర్యటన జరగనుంది.

Updated Date - 2022-05-26T20:10:17+05:30 IST