Abn logo
Sep 21 2021 @ 01:21AM

24న బైడెన్‌తో మోదీ భేటీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, భారత ప్రధాని మోదీ ఈనెల 24న ద్వైపాక్షిక సమావేశం కానున్నారని శ్వేత సౌధం సోమవారం వెల్లడించింది. ఇరు దేశాధినేతల మధ్య ఇదే తొలి సమావేశం. 24న వైట్‌హౌస్‌లో నిర్వహించే క్వాడ్‌ లీడర్స్‌ సమ్మిట్‌లో బైడెన్‌, మోదీ, జపాన్‌ ప్రధాని యోషిహిడే సుగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ పాల్గొంటారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌లతోనూ మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది.