కార్మిక హక్కులను కాలరాస్తున్న మోదీ

ABN , First Publish Date - 2021-11-30T05:38:23+05:30 IST

దేశంలో కార్మికుల హక్కులను ప్రధాని మోదీ కాలరాస్తున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌ ధ్వజమెత్తారు.

కార్మిక హక్కులను కాలరాస్తున్న మోదీ
ప్రసంగిస్తున్న ఎంఏ గఫూర్‌

  1. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్‌ 
  2. ప్రారంభమైన జిల్లా ప్రథమ మహాసభలు 


నంద్యాల, నవంబరు 29: దేశంలో కార్మికుల హక్కులను ప్రధాని మోదీ కాలరాస్తున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌ ధ్వజమెత్తారు. సోమవారం నంద్యాల జిల్లా సీపీఎం ప్రథమ మహాసభలు జిల్లా కార్యదర్శి టి.రమే్‌షకుమార్‌ అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. సీపీఎం సీనియర్‌ నాయకుడు  టి.నరసింహయ్య, టి.షడ్రక్‌లకు నివాళులర్పించి, వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి మహాసభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఏ గఫూర్‌ మాట్లాడుతూ బాధ్యత లేని వ్యక్తి ప్రధానిగా ఉండడం వల్లే ఏడాదికి పైగా రైతులు రోడ్లపై ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఆత్మ నిర్భర్‌ పేరుతో కార్పొరేటర్ల కోసం వేల కోట్ల రూపాయలను ప్రధాని మోదీ కేటాయించారని, ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. కార్మిక హక్కులు కాలరాస్తూ కార్పొరేట్లకు మోదీ సేవ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, ధనలక్ష్మి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాజశేఖర్‌, నాగేశ్వరరావు పాల్గొన్నారు. 



Updated Date - 2021-11-30T05:38:23+05:30 IST