Abn logo
Sep 28 2021 @ 00:28AM

కార్పొరేట్‌ శక్తులకు మోదీ ఊడిగం

బంద్‌ నిర్వహిస్తున్న వామపక్షాలు

 సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి

కొండపి, సెప్టెంబరు 27 : కార్పొరేట్‌ శక్తులకు ప్రధాని మోదీ ఊడిగం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి విమర్శించారు. భారత్‌బంద్‌ సందర్భంగా కొండపిలోని బస్టాండ్‌ కూడలిలో నిరసన తెలిపారు.. ఈ సందర్భంగా దుకాణాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను మూతవేశారు. కార్యక్రమంలో తెలుగురైతు రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి రావిపాటి సీతమ్మ, రైతుకూలి సంఘం అధ్యక్షుడు నాగరాజు, కేజీ మస్తాన్‌, సీపీఐ మండల కార్యదర్శి నన్నూరి గురవయ్య, ప్రజా సంఘాల నాయకులు వై.చంద్రశేఖర్‌, వందనం, బ్రహ్మయ్య, మల్లెల పేతురు, కోటయ్య పాల్గొన్నారు. 

జరుగుమల్లి(కొండపి) : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని టీడీపీ మండల అధ్యక్షుడు పోకూరి రవీంద్రబాబు డిమాండ్‌ చేశారు. భారత్‌బంద్‌లో భాగంగా జరుగుమల్లిలో దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. వాహన రాకపోకలను టీడీపీ, సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్ష ప్రజాసంఘాల నాయకులు నిలువరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోటు శ్రీనివాసమురళి, డి.సుబ్బారెడ్డి, తెలుగు మహిళాసంఘం రాష్ట్ర నాయకులు పేముల విజయనిర్మల, సీపీఎం నాయకుడు తన్నీరు సుబ్బారావు, వివిధ గ్రామాల టీడీపీ నాయకులు, రైతులు, రైతుకూలీసంఘాల నాయకులు, వ్యవసాయ, ఇతర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

టంగుటూరు : రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పలువురు రైతు నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. టంగుటూరులో జరిగిన భారత్‌ బంద్‌ విజయవంతమైంది.  కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి టీ ప్రభాకర్‌, సీపీఎం నాయకుడు మోజెస్‌, టీడీపీ నాయకులు దర్నాసి బ్రహ్మానందం, కాట్రగడ్డ అనిల్‌, కామని శ్రీను, రైతు కూలీ సంఘం నాయకులు వేజండ్ల రామారావు, పరిటాల కోటేశ్వరరావు, ఇఫ్టు నాయకుడు వెంకట్రావు, రైతు నాయకులు వేజండ్ల సింగయ్య, రావూరి బ్రహ్మానందం, హేతువాద సంఘం నాయకులు మొగల్‌కాలీషా బేగ్‌ పాల్గొన్నారు.

పీసీపల్లి : భారత్‌బంద్‌కు మద్దతుగా పీసీపల్లిలో వామపక్షాలు సోమవారం బ్యాంకు కూడలిలో బంద్‌ను చేపట్టారు. ఈ బంద్‌లో పాల్గొన్న రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిప్పారెడ్డి మాట్లాడుతూ బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ రంగ సంస్ధలను కార్పోరేట్‌ కంపెనీలకు కారు చౌకగా అప్పజెప్తున్నారన్నారు. ఈ బంద్‌లో అంగన్‌వాడీ, ఆశా, ఆటో, వ్యవసాయ కార్మిక, గ్రామ సేవలు, రైతు సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయకుమారి, పద్మకుమారి, శ్రీరాములు, స్టీఫెన్‌, కొండయ్య, యాకోబు, బడేసాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు.