పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ నియంత్రణపై బిల్లు

ABN , First Publish Date - 2021-11-24T02:26:24+05:30 IST

న్యూఢిల్లీ: రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మొత్తం 26 బిల్లులలో క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ నియంత్రణపై బిల్లు

న్యూఢిల్లీ: రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మొత్తం 26 బిల్లులలో క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ద క్రిప్టో కరెన్సీ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అఫిషియల్‌ డిజిటల్‌ కరెన్సీ బిల్‌ 2021 పేరిట దానిని ప్రవేశపెట్టనుంది కేంద్రం. 


ఆస్ట్రేలియా వేదికగా ఇటీవల జరిగిన ‘ది సిడ్నీ డైలాగ్‌’ సదస్సులో  వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ ‘ఇండియా టెక్నాలజీ: ఎవల్యూషన్‌ అండ్‌ రివల్యూషన్‌’’ అనే అంశంపై ఆయన కీలక ప్రసంగం చేస్తూ క్రిప్టో కరెన్సీకి సంబంధించి మొదటిసారి మాట్లాడిన విషయం తెలిసిందే. 

చెడ్డవారి చేతుల్లోకి క్రిప్టో క‌రెన్సీ వెళ్లకుండా ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాలు క‌లిసి ఓ నిర్ణయం తీసుకోవల్సిన అవసరముందన్నారు. డిజిటల్ కరెన్సీపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇంకా ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదని, త్వరలో ఓ నిర్ణయానికి రానున్నట్లు ఆయన అన్నారు. కూడా క్రిప్టోకరెన్సీని ఆపలేమని, అయితే నియంత్రించాల్సిన అవసరముందని పార్లమెంటు స్థాయీ సంఘం సలహాలు, సూచనలు ఇచ్చింది.


ఈ నేపథ్యంలో, కొత్తగా ప్రవేశ పెట్టే బిల్లులో అధికారిక డిజిటల్‌ కరెన్సీ ఏర్పాటుకు తగిన ప్రణాళికలు తయారు చేసేందుకు వీలు కల్పించనుందని తెలుస్తోంది. దేశంలో ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీలపై నిషేధం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే క్రిప్టో కరెన్సీ, దానిని ఉపయోగించేందుకు అవసరమైన టెక్నాలజీని ప్రమోట్‌ చేసేందుకు కేంద్రం మినహాయింపులు ఇవ్వవచ్చు.



Updated Date - 2021-11-24T02:26:24+05:30 IST