మోదీ కారు @ రూ.12 కోట్లు

ABN , First Publish Date - 2021-12-28T06:40:09+05:30 IST

ప్రధాని మోదీ వేసుకునే దుస్తులు, ఉపయో గించే వస్తువులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాతో భేటీ సందర్భంగా...

మోదీ కారు @ రూ.12 కోట్లు

న్యూఢిల్లీ, డిసెంబరు 27: ప్రధాని మోదీ వేసుకునే దుస్తులు, ఉపయో గించే వస్తువులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాతో భేటీ సందర్భంగా మోదీ సుమారు రూ.10 లక్షల విలువైన సూట్‌ వేసుకున్నారు. గతంలో ఆయన ధరించిన మేబాష్‌ సన్‌ గ్లాసెస్‌ కూడా వార్తల్లో నిలిచాయి. తాజాగా, మోదీ వాడుతున్న మెర్సిడెస్‌ బెంజ్‌ మేబాష్‌ ఎస్‌ 650 కారు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఢిల్లీకి వచ్చినపుడు ఆయనకు స్వాగతం పలికేందుకు హైదరాబాద్‌ హౌస్‌కు వచ్చిన మోదీ తొలిసారి ఈ కారులో కనిపించారు. ఈ మధ్య మోదీ కాన్వాయ్‌లో మరోసారి ఈ వాహనం కనిపించింది. అత్యున్నత భద్రతా ప్రమాణాలు కలిగిన ఈ కారు విలువ రూ.12 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. 

Updated Date - 2021-12-28T06:40:09+05:30 IST