‘బాల సేన’కు ప్రధాని మోదీ పిలుపు

ABN , First Publish Date - 2020-03-26T22:26:18+05:30 IST

కరోనా వైరస్‌ను తరిమికొట్టే లక్ష్యంతో విధించిన అష్ట దిగ్బంధనం కట్టుదిట్టంగా అమలయ్యే విధంగా

‘బాల సేన’కు ప్రధాని మోదీ పిలుపు

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను తరిమికొట్టే లక్ష్యంతో విధించిన అష్ట దిగ్బంధనం కట్టుదిట్టంగా అమలయ్యే విధంగా చేయడంలో చిన్నారుల సహాయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. 21 రోజులపాటు ఇంట్లో నుంచి కదల వద్దని అందరినీ కోరిన ఆయన, ‘బాల సేన’పై తనకు నమ్మకం ఉందన్నారు. 


మోదీ ఇచ్చిన ఓ ట్వీట్‌లో ‘‘నా ‘బాల సేన’పై నాకు సంపూర్ణ నమ్మకం ఉంది. భారత దేశం కోవిడ్-19తో సమర్థంగా పోరాడటానికి వీలుగా జనం తమ ఇళ్ళలోనే ఉండేవిధంగా వారు చేయగలరు’’ అని పేర్కొన్నారు. 


ఈ ట్వీట్‌తోపాటు మోదీ జత చేసిన వీడియోలో ఓ బాలిక తన తండ్రి ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా ఆపుతున్నట్లు కనిపించింది. 


మోదీ ఈ నెల 24న జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, 21 రోజులపాటు దేశవ్యాప్తంగా అష్టదిగ్బంధనం పాటించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కోవిడ్-19పై పోరాటంలో ఇది చాలా ముఖ్యమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2020-03-26T22:26:18+05:30 IST