నిరాడంబరంగా రాములోరి కల్యాణం

ABN , First Publish Date - 2021-04-22T06:31:46+05:30 IST

అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో జరిగిన స్వామి వారి కల్యాణం వేదబ్రహ్మణులు మంత్రోచ్ఛరణాల నడుమ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా జరిపించారు.

నిరాడంబరంగా రాములోరి కల్యాణం
స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకువస్తున్న మంత్రి ఈటల

ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఈటల

ఇల్లందకుంట, ఏప్రిల్‌ 21: అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో జరిగిన స్వామి వారి కల్యాణం వేదబ్రహ్మణులు మంత్రోచ్ఛరణాల నడుమ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా జరిపించారు. ఉదయం ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ట, ఎదుర్కోళ్ల కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హాజరయ్యారు. ఈ మేరకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మంత్రి ఈటల 40నిమిషాల పాటు తిలకించగా వేదబ్రహ్మణులు మంత్రోచ్ఛరణ నడుమ, బాజా బజంత్రిలు వాయిస్తూ 12:40నిమిషాలకు స్వామి వారి కల్యాణం జరిపించగా పాల్గొన్న భక్తులు కల్యాణం తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ఎంపీపీ సరిగోమ్ముల పావని, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, కేడీసీసీ వైస్‌ చైర్మన్‌ పింగిలి రమేష్‌, జడ్పీటీసీ డాక్టర్‌ శ్రీరాంశ్యామ్‌, జమ్మికుంట ఎంపీపీ మమత, ఆలయ కార్యనిర్వాహణాధికారి కందుల సుధాకర్‌ ఎంపీటీసీ దంసాని విజయలతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు భక్తులు స్వల్ప సంఖ్యలో పాల్గొన్నారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా స్థానిక సీఐ చుంచు విద్యాసాగర్‌, ఎస్‌ఐ ప్రవీణ్‌రాజ్‌లు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.

Updated Date - 2021-04-22T06:31:46+05:30 IST