నిరాడంబరంగా..

ABN , First Publish Date - 2022-01-27T05:18:18+05:30 IST

73వ గణతంత్ర దినోత్సవాన్ని మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లోని కలెక్టరేట్‌లో నిరాడంబరంగా నిర్వహించారు.

నిరాడంబరంగా..
మెదక్‌ కలెక్టరేట్‌లో జాతీయ జెండాకు వందనం చేస్తున్న జిల్లా కలెక్టర్‌ హరీశ్‌, అధికారులు

మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో గణతంత్ర దినోత్సవం

కొవిడ్‌ దృష్య్టా అధికారులు మాత్రమే హాజరు

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా


మెదక్‌రూరల్‌/మెదక్‌మున్సిపాలిటీ/మెదక్‌అర్బన్‌ జనవరి26: 73వ గణతంత్ర దినోత్సవాన్ని మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లోని కలెక్టరేట్‌లో నిరాడంబరంగా నిర్వహించారు. మెదక్‌లో మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ జాతీయజెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కొవిడ్‌ దృష్ట్యా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించలేదు. జిల్లా అంతటా కూడా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు ప్రతిమాసింగ్‌, రమేష్‌, ట్రైయినీ కలెక్టర్‌ అశ్విని, డీఆర్డీవో శ్రీనివాస్‌, డీఈవో రమే్‌షకుమార్‌, డీఎస్పీ సైదులు, జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణమూర్తి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరుశురాంనాయక్‌, డీపీవో తరుణ్‌కుమార్‌, జిల్లా సైన్స్‌ అధికారి రాజీరెడ్డి ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పలు కార్యాలయాల్లో

జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలోనూ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో డీఎస్పీ సైదులు,  తదితరులు పాల్గొన్నారు. జడ్పీ కార్యాలయంలో సీఈవో శైలే్‌షకుమార్‌, ట్రాన్స్‌కో కార్యాలయంలో జానకీరాం, పీఆర్‌, డీఎస్పీ కార్యాలయంలో జాతీయజెండాను ఆవిష్కరించారు.  మెదక్‌ ఎంపీడీవో కార్యాలయంలో శ్రీరాములు జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఒకటో వార్డు కౌన్సిలర్‌ భీమరి కిశోర్‌ జాతీయ జెండాను  వార్డులో ఎగురవేశారు. అన్ని ప్రభుత్వపాఠశాలలు, గ్రామ పంచాయతీలతో మువ్వన జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ శ్రీహరి జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ చంద్రపాల్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

కొవిడ్‌ నిబంధనల మేరకు

 ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జనవరి26: కొవిడ్‌ నిబంధనల మేరకు 73వ రిపబ్లిక్‌ డే వేడుకలు బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిరాడంబరంగా జరిగాయి. జిల్లా కలెక్టర్‌ ఎం.హన్మంతరావు తొలుత మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ వెంటనే జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. కొవిడ్‌ కారణంగా ఈ సారి ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు అవార్డులు ఇవ్వడం తదితర కార్యక్రమాలేవీ నిర్వహించలేదు. వేడుకల్లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతికదూరం పాటిస్తూ పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-27T05:18:18+05:30 IST