మోడెర్నా టీకా మూడో డోసుతో ఒమైక్రాన్‌ నుంచి రక్షణ

ABN , First Publish Date - 2021-12-21T02:59:15+05:30 IST

మోడెర్నా కరోనా టీకా మూడో డోసు ఒమైక్రాన్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీ స్థాయులను గణనీయంగా పెంచినట్టు

మోడెర్నా టీకా మూడో డోసుతో ఒమైక్రాన్‌ నుంచి రక్షణ

న్యూఢిల్లీ: మోడెర్నా కరోనా టీకా మూడో డోసు ఒమైక్రాన్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీ స్థాయులను గణనీయంగా పెంచినట్టు కంపెనీ పేర్కొంది. 50 మైక్రోగ్రాముల బూస్టర్ డోస్‌ (ఇది ప్రాథమిక రోగ నిరోధకత కోసం వేసే మోతాదులో సగం)తో యాంటీబాడీలలో 37 రెట్ల పెరుగుదల కనిపించినట్టు తెలిపింది. ఇక, 100 మైక్రోగ్రాముల మోతాదుతో పరీక్షించగా యాంటీబాడీ స్థాయులు 83 రెట్లు పెరిగినట్టు పేర్కొంది. 


వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమైక్రాన్‌ను తటస్థీకరించడానికి మూడు షాట్‌లు అవసరమవుతాయని ఇది నిరూపిస్తోంది. కాగా, ఫైజర్, బయోఎన్‌టెక్ ఎస్ఈ కూడా ఈ నెల మొదట్లో ఓ ప్రకటన చేస్తూ.. తమ టీకాల మూడో డోసుతో.. తొలి రెండు డోసుల్లో లభించినంత రక్షణ లభిస్తుందని పేర్కొన్నాయి.  

Updated Date - 2021-12-21T02:59:15+05:30 IST