అమెరికా ఎన్నికల నాటికి వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదు: మోడెర్నా

ABN , First Publish Date - 2020-10-01T16:28:36+05:30 IST

అమెరికా ఎన్నికలకు ముందే కరోనా వ్యాక్సిన్ విడుదలయ్యే అవకాశాలు

అమెరికా ఎన్నికల నాటికి వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదు: మోడెర్నా

వాషింగ్టన్: అమెరికా ఎన్నికలకు ముందే కరోనా వ్యాక్సిన్ విడుదలయ్యే అవకాశాలు ఏమాత్రం లేవని బయోటెక్నాలజీ సంస్థ మోడెర్నా స్పష్టం చేసింది. నవంబర్ 25 నాటికి వ్యాక్సిన్ ఎంతవరకు సురక్షితమైనదన్న దానిపై తమకు సరైన స్పష్టత వస్తుందని మోడెర్నా సీఈఓ స్టీఫనీ బాన్సెల్ తెలిపారు. వ్యాక్సిన్ సురక్షితం అని తేలిన తరువాత ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) అప్రూవల్‌కు పంపుతామన్నారు. నవంబర్ 25 కంటే ముందుగానే వ్యాక్సిన్‌ను విడుదల చేసేలా అత్యవసర వినియోగ అధికారాన్ని మోడెర్నా కోరదని స్టీఫనీ బాన్సెల్ తేల్చిచెప్పారు. 


కాగా.. అమెరికాలో కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ది చేస్తున్న సంస్థల్లో మోడెర్నా కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సంస్థ వ్యాక్సిన్ ప్రయోగాలు చివరిదశలో ఉన్నాయి. ఇక మోడెర్నా తాజా ప్రకటనతో అధ్యక్షుడు ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది. నవంబర్ మూడో తేదీన అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు జరగనున్నాయి. ఈలోపే ఏదో విధంగా వ్యాక్సిన్‌ను విడుదల చేయించి మరోమారు అధ్యక్ష పదవిని చేపట్టాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. నవంబర్ ఒకటో తేదీలోపే వ్యాక్సిన్ రావొచ్చంటూ బుధవారం జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో సైతం ఆయన నొక్కి చెప్పారు. మరోపక్క రాజకీయ ప్రయోజనం కోసం వ్యాక్సిన్ త్వరగా విడుదలయ్యేలా ట్రంప్ ప్రభుత్వం రెగ్యులేటరీ ప్రాసెస్‌లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-10-01T16:28:36+05:30 IST