మరింత ప్రమాదకర స్ట్రెయిన్లు రాబోతున్నాయి: మోడెర్నా సీఈవో

ABN , First Publish Date - 2021-05-07T17:44:29+05:30 IST

కరోనా వైరస్ ఇప్పట్లో ప్రపంచాన్ని వదిలిపెట్టదని, రాబోయే రోజుల్లో మరో కొత్త స్ట్రెయిన్ మరింతగా విజృంభించనుంద

మరింత ప్రమాదకర స్ట్రెయిన్లు రాబోతున్నాయి: మోడెర్నా సీఈవో

కరోనా వైరస్ ఇప్పట్లో ప్రపంచాన్ని వదిలిపెట్టదని, రాబోయే రోజుల్లో మరో కొత్త స్ట్రెయిన్ మరింతగా విజృంభించనుందని అమెరికా ప్రముఖ ఔషద తయారీ సంస్థ మోడెర్నా సీఈవో స్టెఫేన్ బాన్సల్ అన్నారు. మరో ఆరు నెలల్లో కొత్త స్ట్రెయిన్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేయనుందని, దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. 


`దక్షిణాది దేశాల్లో జూన్ నెలలో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ సమయంలో కరోనా కొత్త స్ట్రెయిన్ మరింత విజృంభించే అవకాశముంది. ఈ వైరస్‌ను ఎదుర్కోవాలంటే బూస్టర్ డోస్‌లు అవసరమవుతాయ`ని బాన్సల్ అన్నారు. అలాగే దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా రూపొందించిన బూస్టర్ డోస్ ఎంఆర్ఎన్ఏ 1273,351 సత్ఫలితాలనిస్తోందని, వివిధ స్ట్రెయిన్లను ఎదుర్కొనేందుకు బూస్టర్ డోస్‌లను తయారు చేయగలమన్న నమ్మకం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-07T17:44:29+05:30 IST