మోడల్‌ టౌన పనులు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-05-25T05:43:55+05:30 IST

పులివెందుల మోడల్‌ టౌన, మెడికల్‌ కాలే జీ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు అధికారులను ఆదేశించారు.

మోడల్‌ టౌన పనులు వేగవంతం చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయరామరాజు

అధికారుల సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ విజయరామరాజు

కడప(కలెక్టరేట్‌), మే 24: పులివెందుల మోడల్‌ టౌన, మెడికల్‌ కాలే జీ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబరులో పులివెందుల నియోజ కవర్గ అబివృద్ధి పనుల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పాడా ఓఎస్డ్డీ అనిల్‌కుమార్‌ రెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహరెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో అత్యంత ప్రాధాన్యతతో చేపట్టిన మోడల్‌ టౌన పనులను వేగవంతం చేయాలన్నారు. డిసెంబరులో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఉంటుందని, ఆయన చేతుల మీదుగా ప్రారంభించేలా చూడాలన్నారు. రింగ్‌ రోడ్డు పనులు, ప్రధాన రహదారుల అభివృద్ధి, మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్సు, ష్లాటర్‌హౌస్‌, మార్కెట్‌, సిటిజన సర్వీసు సెంటరు, రాయలపురం బ్రిడ్జి, ఉలిమేళ్ల లేక్‌, హౌసింగ్‌ కాలనీ పనుల పురోగతిపై సమీక్షించారు.  

Updated Date - 2022-05-25T05:43:55+05:30 IST