వచ్చే నెల 21న మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్షలు

ABN , First Publish Date - 2021-07-25T08:22:24+05:30 IST

2021-22 విద్యా సంవత్సరానికి మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్షలు ఆగస్టు 21(శనివారం)న నిర్వహించనున్నట్లు అడిషనల్‌ డైరెక్టర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు...

వచ్చే నెల 21న మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్షలు

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): 2021-22 విద్యా సంవత్సరానికి మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్షలు ఆగస్టు  21(శనివారం)న నిర్వహించనున్నట్లు అడిషనల్‌ డైరెక్టర్‌  శనివారం ఒక  ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతిలో ప్రవేశం, ఏడు నుంచి పదో తరగతి వరకుగల ఖాళీ సీట్ల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరో తరగతి ప్రవేశ పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏడు నుంచి పదో తరగతి వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణకు ఆర్‌జేడీలు, డీఈఓలు, మోడల్‌ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, జేఈఈ మెయిన్‌-2021 పరీక్ష రాయలేని మహారాష్ట్రలోని కొన్ని పట్టణాలకు చెందిన విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) తెలిపింది. మొత్తం 334 పట్టణాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి.  ఈ నెల 20న ప్రారంభమైన ఈ పరీక్షలు 27 వరకు కొనసాగుతాయని పేర్కొంది. అయితే, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నందున  కొల్హాపూర్‌, పాల్ఘర్‌, రత్నగిరి, రాయిగఢ్‌, సింధుదుర్గ్‌, సాంగ్లి, సటారా పట్టణాలకు చెందిన విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోలేకపోతే వారికి మరోసారి పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని  తెలిపింది. 


Updated Date - 2021-07-25T08:22:24+05:30 IST