బాధితులకు న్యాయం దక్కేలా పనిచేయాలి

ABN , First Publish Date - 2022-07-04T06:00:44+05:30 IST

ప్రతి న్యాయవాది వృత్తిపట్ల అంకిత భావంతో, బాధితుడికి న్యాయం దక్కేలా పనిచేయాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు.

బాధితులకు న్యాయం దక్కేలా పనిచేయాలి
మోడల్‌ లాసెట్‌ పేపర్లును విడుదల చేస్తున్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు, చంద్రగిరిఏసురత్నం, జంగా కృష్ణమూర్తి తదితరులు

మోడల్‌ లాసెట్‌ను ప్రారంభోత్సవంలో  ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు

గుంటూరు(తూర్పు), జూలై 3: ప్రతి న్యాయవాది వృత్తిపట్ల అంకిత భావంతో, బాధితుడికి న్యాయం దక్కేలా పనిచేయాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. ఏపీబీసీ అడ్వకేట్స్‌ ఆధ్వర్యం లో లక్ష్మీపురం మాంటిస్సోరి పాఠశాలలో ఆదివారం ఉచిత మోడల్‌ లాసెట్‌ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షను ప్రారంభించిన అనంతరం ఎంపీ మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో అనేక అవకాశాలున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మిర్చియార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ న్యాయవాద వృత్తి గౌరవప్రదమైందని, సమాజంలో ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఎదగాలని ఆకాక్షించారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ మోడల్‌పరీక్షలు అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకో వాలని పేర్కోన్నారు. కార్యక్రమంలో ఏపీబీసీ అడ్వకేట్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు పల్లపకృష్ణ, వైసీపీ లీగల్‌సెల్‌ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యుడు పోలూరి వెంకటరెడ్డి, జిల్లా నాయకులు సీడీ భగవాన్‌, జిల్లా కోర్టు జీపీ పోకల వెంకటేశ్వర్లు, అసోసియేషన్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ గౌస్‌బాషా, కే శ్రీనివాసరావు, ఎన్‌. శ్రీనివాసరావు, పాఠశాల ప్రిన్సిపల్‌ సెబాస్టియన్‌, న్యాయవాదులు లీలాకృష్ణ, అనిల్‌, శుభాకర్‌ తదితరులు పాల్గొన్నార. 


Updated Date - 2022-07-04T06:00:44+05:30 IST