మోదకొండమ్మకు నీరాజనం

ABN , First Publish Date - 2022-05-18T06:46:53+05:30 IST

మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ముగిశాయి. అనుపోత్సవంలో భాగంగా శతకంపట్టు నుంచి ఉత్సవ విగ్రహం, పాదాలును శిరస్సుకెత్తుకుని ఆలయ కమిటీ చైౖర్‌పర్సన్‌, ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, ట్రైకార్‌ చైర్మన్‌ సతక బుల్లిబాబు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ, సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌ తదితరులు ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు.

మోదకొండమ్మకు నీరాజనం
పాడేరు వీధుల్లో అనుపోత్సంలో పాల్గొన్న జనం

ఘటాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు

ఘనంగా అమ్మవారి అనుపోత్సవం 

భారీ స్థాయిలో ఊరేగింపు  

ఆకట్టుకున్న ప్రదర్శనలు

పాడేరు, మే 17(ఆంధ్రజ్యోతి): మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ముగిశాయి. అనుపోత్సవంలో భాగంగా శతకంపట్టు నుంచి ఉత్సవ విగ్రహం, పాదాలును శిరస్సుకెత్తుకుని ఆలయ కమిటీ చైౖర్‌పర్సన్‌, ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, ట్రైకార్‌ చైర్మన్‌ సతక బుల్లిబాబు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ, సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌ తదితరులు ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనుపోత్సవం ఊరేగింపులో భాగంగా నేల వేషాలు, డప్పుల మోతలు, తీన్‌మార్‌ బ్యాండ్‌లు, తప్పె టగుళ్లు, పులివేషాలు, పలు రకాల దేవతా మూర్తుల వేషధారణలు వంటివి ఏర్పాటు చేశారు. ఉత్సవాల ఆఖరి రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మంగళవారం ఉదయం నుంచి అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. పలువురు భక్తులు తలనీలాలు సమర్పించారు. మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. 

అనుపోత్సవానికి పోటెత్తిన భక్తులు

మోదకొండమ్మ ఉత్సవాల ముగింపులో భాగంగా మంగళవారం నిర్వహించిన అనుపోత్సవానికి భక్తులు పోటెత్తారు. గత రెండేళ్లుగా ఉత్సవాలు జరగకపోవడంతో ఊహించని రీతిలో ముగింపు రోజు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. దీంతో పాడేరు పట్టణ వీధులు జనంతో కిటకిటలాడాయి. ఈ కార్యక్ర మంలో అదనపు ఎస్‌పీ పి.జగదీశ్‌, చింతపల్లి ఏఎస్‌పీ తుషార్‌డూడి, సీఐ బి.సుధాకర్‌, ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుడు డాక్టర్‌ టి.నరసింగరావు, వి.మాడుగుల ఎంపీపీ వి.రామధర్మజ, జి.మాడుగుల జడ్పీటీసీ సభ్యురాలు ఎం.వెంకటలక్ష్మి, సర్పంచ్‌ కొట్టగుళ్లి ఉషారాణి, స్ధానిక వైసీపీ నేతలు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-18T06:46:53+05:30 IST