స్వాతంత్య్ర వేడుకలకు మాక్‌ డ్రిల్‌

ABN , First Publish Date - 2022-08-13T06:52:16+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నగరంలో పోలీస్‌ బ్యారెక్స్‌లో పోలీసులు మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. జెండా ఆవిష్కరణ, అనంతరం గౌరవ వందనం వంటి కార్యక్రమాలపై శుక్రవారం బ్యారెక్స్‌ మైదానంలో రిహార్సల్‌ నిర్వహించారు. సిటీ పోలీస్‌ ఆర్మ్‌డ్‌ విభాగం నేతృత్వంలో రిహార్సల్స్‌ జరిగాయి.

స్వాతంత్య్ర వేడుకలకు మాక్‌ డ్రిల్‌
మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తున్న పోలీసులు

విశాఖపట్నం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నగరంలో పోలీస్‌ బ్యారెక్స్‌లో పోలీసులు మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. జెండా ఆవిష్కరణ, అనంతరం గౌరవ వందనం వంటి కార్యక్రమాలపై శుక్రవారం బ్యారెక్స్‌ మైదానంలో రిహార్సల్‌ నిర్వహించారు. సిటీ పోలీస్‌ ఆర్మ్‌డ్‌ విభాగం నేతృత్వంలో రిహార్సల్స్‌ జరిగాయి. 

నేడు బీచ్‌లో నేవీ పరేడ్‌

ఆజాదీకా అమృతోత్సవ్‌లో భాగంగా తూర్పు నావికాదళం శనివారం ఆర్కే బీచ్‌లో పరేడ్‌ నిర్వహించనున్నది. నేవీ ఉన్నతాధికారులు, నావికులు పాల్గొనున్న కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి నేవీ, పోలీసు అధికారులు శుక్రవారం సాయంత్రం బీచ్‌ను పరిశీలించారు. 

Updated Date - 2022-08-13T06:52:16+05:30 IST