మొబైల్‌ స్ర్కీన్‌ టీవీలో ఎలా?

ABN , First Publish Date - 2020-08-22T19:41:44+05:30 IST

దీనికోసం తప్పనిసరిగా మీ టీవీలో అంతర్గతంగా స్ర్కీన్‌ మిర్రరింగ్‌ సదుపాయం ఉండాలి. అలాగే మీ దగ్గర ఉన్న టీవీలో వైఫై సదుపాయం ఉండి, టీవీ, మీ ఫోన్‌ రెండూ ఒకటే వైఫై నెట్‌వర్క్‌కి కనెక్ట్‌ అయి ఉండాలి.

మొబైల్‌ స్ర్కీన్‌ టీవీలో ఎలా?

నేను ఏపీ ఫైబర్‌ సెట్‌టాప్‌ బాక్స్‌ వాడుతున్నాను. మొబైల్‌ స్ర్కీన్‌ని టీవీలో ఎలా చూడాలో తెలియడం లేదు. వివరించండి? 


దీనికోసం తప్పనిసరిగా మీ టీవీలో అంతర్గతంగా స్ర్కీన్‌ మిర్రరింగ్‌ సదుపాయం ఉండాలి. అలాగే మీ దగ్గర ఉన్న టీవీలో వైఫై సదుపాయం ఉండి, టీవీ, మీ ఫోన్‌ రెండూ ఒకటే వైఫై నెట్‌వర్క్‌కి కనెక్ట్‌ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే స్ర్కీన్‌ మిర్రరింగ్‌ సాధ్యపడుతుంది. మీరు వాడే మొబైల్‌ ఫోన్‌లో కూడా నోటిఫికేషన్‌ ప్రదేశంలో ఉన్న షార్ట్‌కట్స్‌లో స్ర్కీన్‌ మిర్రరింగ్‌ సదుపాయం ఉందో లేదో పరిశీలించండి. కేవలం కొన్ని ఫోన్లలో మాత్రమే ఇది లభిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు వాడుతున్న ఫోన్‌లో సంబంధిత సదుపాయం లేకపోతే చేయగలిగిందేమీ లేదు. మీరు ఎలాంటి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ వాడుతున్నా టీవీ మరియు ఫోన్‌ రెండూ ఈ ఫీచర్‌ని సపోర్ట్‌ చేసినప్పుడు మాత్రమే మీకు కావలసిన ఫలితాలు లభిస్తాయి.

- నిహిత్‌, కంచికచర్ల

Updated Date - 2020-08-22T19:41:44+05:30 IST