Begumpet: చెట్టు కొమ్మ పడడంతో ఆగిన ఎంఎంటీఎస్‌ రైలు

ABN , First Publish Date - 2022-10-01T16:21:27+05:30 IST

చెట్టు కొమ్మ పడడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి పెద్ద శబ్దంతో ఎంఎంటీఎస్‌ రైలు నిలిచిపోయింది. ప్రయాణికులు ఆందోళన చెంది రైలు దిగి వెళ్లి పోయారు. శుక్రవారం ఉదయం 8.20

Begumpet: చెట్టు కొమ్మ పడడంతో ఆగిన ఎంఎంటీఎస్‌ రైలు

హైదరాబాద్/బేగంపేట: చెట్టు కొమ్మ పడడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి పెద్ద శబ్దంతో ఎంఎంటీఎస్‌ రైలు నిలిచిపోయింది. ప్రయాణికులు ఆందోళన చెంది రైలు దిగి వెళ్లి పోయారు. శుక్రవారం ఉదయం 8.20 గంటలకు లింగంపల్లి - హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ రైలు బేగంపేట స్టేషన్‌ దాటి హుస్సేన్‌ సాగర్‌ క్రాస్‌ వద్దకు రాగానే పెద్ద శబ్దం చేస్తూ అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కొందరు రైలు దిగి వెళ్లి పోయారు. రైలుకు విద్యుత్‌ సరఫరా జరిగే పాథన్‌పై చెట్టు కొమ్మ పడడంతో సరఫరా బంద్‌ అయి, రైలు ఆగిపోయినట్లుగా గుర్తించారు. సిబ్బంది 15 నిమిషాల్లో  చెట్టు కొమ్మను తొలగించి సమస్యను పరిష్కరించడంతో రైలు ముందుకు కదలినట్లు రైల్వే రక్షక దళ ఇన్‌స్పెక్టర్‌ భవానీ శంకర్‌ సరస్వతి తెలిపారు.

Updated Date - 2022-10-01T16:21:27+05:30 IST