నెల్లూరు: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా కష్టకాలంలో చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోవడం దౌర్భాగ్యమన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేసిన విద్యార్ధులను లాఠీలతో చితకబాదించడం దారుణమన్నారు. రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయం కావడంతో ఆర్టీసీ బస్సులూ తిరగడం లేదని ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి పేర్కొన్నారు.