Abn logo
Aug 11 2020 @ 03:58AM

జీ+3 ఇళ్లు పంపిణీ చేయకపోతే ఉద్యమిస్తాం

మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 10 : తెలుగుదేశం హయాంలో జీ+3 ఇళ్లు నిర్మించి పేదలకు కేటాయిస్తే, అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా వైసీపీ వాటిని పేదలకు ఇవ్వకపోవడం విచారకరమని ఎమ్మెల్సీ, టీడీపీ  జిల్లా  అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు జీ+3 ళ్లు అందజేయాలని డిమాండ్‌ చేస్తూ గో సంఘం  జీ+3 ఇళ్ల వద్ద బచ్చుల అర్జునుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబాప్రసాద్‌, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ గోపు సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్‌ కొట్టె వెంకట్రావు తదితరులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.


అర్జునుడు మాట్లాడుతూ  టీడీపీ హయాంలో రూ. 50 వేల కోట్లతో 25 లక్షల 57 వేల ఇళ్లు నిర్మించామన్నారు. బందరులో నిర్మించిన ఇళ్లను తక్షణం లబ్ధిదారులకు కేటాయించకపోతే ఉద్యమిస్తామన్నారు.పేదల ఇళ్లస్థలాల కొనుగోలులో  భారీ కుంభకోణం జరిగిందన్నారు. పల్లపు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తున్నామన్నారు. మునిసిపల్‌  మాజీ వైస్‌చైర్మన్‌ పంచపర్వాల కాశీవిశ్వనాథం, మరకాని పరబ్రహ్మం, ఎండీ ఇలియాస్‌ పాషా, తలారి సోమశేఖర్‌, భాగ్యారావు, అజీమ్‌, హరికృష్ణ  పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement