ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌పై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-05-21T06:49:29+05:30 IST

రంపచోడవరం డివిజన్‌ పరిధిలో ఉంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌పై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా కృష్ణారావు శుక్రవారం జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు.

ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌పై చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్న బీజేపీ నాయకులు


దళిత యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలి

పాడేరురూరల్‌, మే 20: రంపచోడవరం డివిజన్‌ పరిధిలో ఉంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌పై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా కృష్ణారావు శుక్రవారం జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ..రంపచోడవరం కేంద్రంగా వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌  అనేక అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ముఖ్యంగా ఆ ప్రాంత మహిళలపై అనేక అఘాయిత్యాలకు పాల్పడుతూ..ప్రశ్నించే వారిని అధికార పార్టీ అండతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. అనంతబాబు చీకటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని అనేక అక్రమాలకు పాల్పడుతున్న ఆరోపణలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ వద్ద ఐదేళ్లగా డ్రైవర్‌గా పనిచేస్తున్న దళిత యువకుడిని దారుణంగా హత్యచేసి తప్పించుకుపారిపోయాడన్నారు. యువకుడి హత్యపై సీబీఐ విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి అనంతబాబును ఎమ్మెల్సీ నుంచి భర్తరఫ్‌ చేసి అరెస్టు చేయించాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శరభ వేమన్న, సల్లా రామకృష్ణ, రాఘవేంద్రరావు, పాంగి మత్స్యకొండబాబు, వాడపల్లి అబ్బులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-21T06:49:29+05:30 IST