ఎమ్మెల్సీని శిక్షించాలి: టీడీపీ

ABN , First Publish Date - 2022-05-23T06:15:39+05:30 IST

కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యం మృతికి వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ బాధ్యులని, ఆయనను శిక్షించాలని టీడీపీ ఎస్సీ సెల్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్సీని శిక్షించాలి: టీడీపీ

డోన్‌, మే 22: కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యం మృతికి వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ బాధ్యులని, ఆయనను శిక్షించాలని టీడీపీ ఎస్సీ సెల్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు మాట్లాడుతూ దళిత సామాజికవర్గానికి చెందిన సుబ్రహ్మణ్యంను హత్య చేయడం దుర్మార్గమన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్‌ చేయా లన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ డోన్‌ మండల అధ్యక్షుడు బాలు, ప్రధాన కార్యదర్శి చిన్న రామచంద్రుడు, కార్యదర్శి వలసల రవి, పట్టణ కార్యదర్శి నాగా ర్జున, బండి పుల్లన్న, పెద్ద రామచంద్రుడు, రామాంజనేయులు, గంధం ఓబ య్య, తెలుగు యువత పట్టణ ప్రధాన కార్యదర్శి సిటీ కేబుల్‌ కిరణ్‌ పాల్గొన్నారు.


నందికొట్కూరు: రాష్ట్రంలో దలితులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆదివారం నిరసన చేపట్టారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి చిన్న వెంకటస్వామి, ఎస్సీ సెల్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి జయసూర్య మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో రాక్షస పాలన సాగుతోందని ఆరోపించారు. దళిత మహిళలపై దాడులు, అత్యాచారాలు, దౌర్జన్యాలు నిరతంరం జరుగుతు న్నాయని మండిపడ్డారు. మహిళలపై అత్యాచారం, హత్య కేసుల్లో దోశులను శిక్షించకపోవడం సిగ్గుచేటన్నారు. యువకుడు సుబ్రహ్మణ్యం మృతిపై పోలీస్‌ స్టేషనన్‌లో ఫిర్యాదు చేసిన వారిపైనే తిరిగి దాడులు చేసే పరిస్థితి  నెలకొనడం దారుణమన్నారు. ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మెనార్టీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి షకీల్‌ అహమ్మద్‌, రషీద్‌ఖాన్‌, ముర్తుజావలి, వేణుగోపాల్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-23T06:15:39+05:30 IST