Abn logo
Jul 1 2020 @ 03:14AM

సునీత ‘అనర్హత’కు ఆధారాలు సమర్పించండి

టీడీపీ విప్‌ వెంకన్నకు అసెంబ్లీ కార్యదర్శి లేఖ


అమరావతి, జూన్‌  30 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ పోతుల సునీతపై అనర్హత వేటు వేయాలని టీడీపీ కోరిందని.. అయితే అందుకు తగిన ఆధారాలు సమర్పించాలని శాసనమండలిలో ఆ పార్టీ విప్‌ బుద్దా వెంకన్నకు శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు సూచించారు. మంగళవారం ఈ మేరకు లేఖ రాశారు. సునీత అనర్హత పిటిషన్‌ పై జూలై 2న విచారిస్తామని మండలి చైర్మన్‌  ఎంఏ షరీఫ్‌ ఆదేశించారని అందులో తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు వాట్సాప్‌ వీడియో కాన్ఫ్ఫరెన్‌ ్స ద్వారా విచారణకు హాజరవ్వాలని సునీతకు నోటీసులు జారీ చేశారని, విచారణకు ముందుగానే అన్ని డాక్యుమెంట్లు, అఫిడవిట్లను ఈ- మెయిల్‌ ద్వారా లేదా నేరుగా మండలి కార్యదర్శికి అందించాలని సునీతను కూడా ఆదేశించారు.

Advertisement
Advertisement
Advertisement