జనగామ (Janagama): వచ్చే ఎన్నికల్లో (Elections) జనగామ నుంచి పోటీచేస్తున్నారన్న వార్తలపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (Pochampally Srinivas Reddy) క్లారిటీ ఇచ్చారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 12 నియోజకవర్గాలకు ఎమ్మెల్సీగా గెలుపొందానని.. అందరి బాగోగులు చూసే వ్యక్తినని అన్నారు. పార్టీ ఆదేశాల మేరకు జనగామలో ఇన్చార్జ్‌గా పనిచేశానని, జనగామ ఎమ్మెల్యే టికెట్ రేసులో తాను ఉన్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. గత 20 ఏళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వెంట నడుస్తున్నాని, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో సైతం తనకు అనుబంధం ఉందన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నాయకత్వంలో జనగామ నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోందన్నారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి