హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మెడలు వంచుతామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ ప్రతిసారీ అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రైతులను బెదిరిస్తున్నది, అవమాన పరుస్తున్నది మీరేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమా మీద మాట్లాడిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపైన దాడి చేసింది బీజేపీ కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎదురు మాట్లాడితే ఈడీ దాడులు, సీబీఐ దాడులు చేయిస్తున్నది మీరే కదా అని ఆయన నిలదీశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మీరే ధాన్యం కొనాలని ఆయన సవాల్ విసిరారు. ఉగాది తరవాత తమ ఉద్యమం ఉదృతం చేస్తామని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి