చంద్రబాబు నమ్మకాన్ని నిలబెడతా..

ABN , First Publish Date - 2020-10-18T16:37:33+05:30 IST

నాడు ఎన్టీ రామారావుపై అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన... కార్యకర్త స్థాయి నుంచి అంచెలం చెలుగా ఎదుగుతూ వచ్చారు..

చంద్రబాబు నమ్మకాన్ని నిలబెడతా..

పార్టీని మరింత బలోపేతం చేస్తా

కష్టపడే వారికి టీడీపీలో ఎప్పుడూ గుర్తింపు

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళతా

‘ఆంధ్రజ్యోతి’తో అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు


అనకాపల్లి: నాడు ఎన్టీ రామారావుపై అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన... కార్యకర్త స్థాయి నుంచి అంచెలం చెలుగా ఎదుగుతూ వచ్చారు. పట్టణ పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు. ఆ తరువాత ఎమ్మెల్సీగా ఎన్నిక య్యారు. ఇప్పుడు పార్లమెంట్‌ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడిగా నియమి తులయ్యారు. ఆయనే బుద్ద నాగజగదీశ్వరరావు. టీడీపీలో కష్టపడే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంద నడానికి తానే నిదర్శనమంటున్న జగదీశ్‌.. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనపై వుంచిన నమ్మకాన్ని నిలబెడతానని చెప్పారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడిగా ఆదివారం బాధ్యతలు చేపడుతున్న సందర్భం గా ‘ఆంధ్రజ్యోతి’తో జగదీశ్వరరావు మాట్లాడారు.


పార్టీ అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు?

పార్టీని నమ్ముకున్న నాకు మా అధినేత చంద్ర బాబు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసి ఆయన నమ్మకాన్ని నిలబెడతా ను.  అన్ని నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమన్వయం చేసుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాను. 


పార్టీలో లోటుపాట్లను సరిచేయడానికి ఏ చర్యలు తీసుకుంటారు?

నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తాను. నేతల మధ్య మనస్పర్థలు వుంటే వారిని ప్రత్యేకంగా కూర్చోబెట్టి మాట్లాడతాను. వాటిని తొలగించి పార్టీ కోసం విస్తృతంగా పనిచేసేలా చేస్తాను. 


రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై మీరేమంటారు?

రాష్ట్ర ప్రభుత్వం పనితీరు అధ్వానంగా ఉంది. ఇది రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికులు ఎన్నో కష్టాల్లో అనుభవిస్తున్నారు. ప్రధానంగా ఇసుక సమస్య వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. పేదలకు ఎంతో ప్రయోజనకరమైన అన్న క్యాంటీన్లు రద్దు చేశారు. యువతకు ఇచ్చే స్వయం ఉపాధి రుణాలను నిలిపేశారు. ఎస్సీ, ఎస్టీ పేద పిల్లలకు అందుతున్న కార్పొరేట్‌ విద్యను దూరం చేస్తున్నారు. అంతేకాకుండా దళితులపై దాడులకు ఎగబడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్నివర్గాల వారికి ప్రభుత్వ పథకాలు అందించాం. వైసీపీ హయాంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. 


మూడు రాజధానుల ఏర్పాటుపై మీ స్పందన?

దేశంలో మూడు రాజధానుల విధానం ఎక్కడా లేదు. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో సైతం ఒకే రాజధాని కొనసాగుతోంది. ఎక్కడైనా రాష్ట్రానికి మధ్యలో రాజధానులు ఉంటాయి. 13 జిల్లాలతో కూడిన రాష్ట్రానికి మూడు రాజధానులు వుండాలన్న ఆలోచన అవివేకం. అమరావతి రాజధాని అయితే ఇటు శ్రీకాకుళం జిల్లా వారికి అటు అనంతపురం జిల్లా వారికి, రాయలసీమ ప్రజలకు అందు బాటులో ఉంటుంది. మా పార్టీ అధినేత దూరదృష్టితో అలోచించి రాజధానిగా అమరావతిని ఎంపిక చేసి రైతుల నుంచి భూములు సేకరించారు. ఇప్పుడు ఆ రైతులను వైసీపీ ప్రభుత్వం హింసించడం దారుణం.

Updated Date - 2020-10-18T16:37:33+05:30 IST