Abn logo
Feb 24 2021 @ 23:36PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగరాలి

 విపక్షాల విష ప్రచారాన్ని తిప్పికొట్టండి

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి 

ఖమ్మంఫిబ్రవరి24(ఆంధ్రజ్యోతిప్రతినిధి): పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగుర వేయాలని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లారాజేశ్వరరెడ్డి తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని కోరారు. ఖమ్మం ఎస్‌బీఐటీ కళాశాలలో టీఆర్‌ఎస్‌ ముఖ్యకార్యకర్తలు నాయకులతో జరిగిన సభలో పల్లా మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అన్ని ప్రభ్వురంగ పరిశ్రమలు ప్రైవేటు పరం చేస్తోందన్నారు. ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిస్తున్నారని తెలిపారు ఏడాదికాలంలో ఉమ్మడి ఖమ్మంజిల్లాలో సీతారామద్వారా ప్రతీ ఎకరానికి సాగు నీరు అందిస్తామన్నారు. గోదావరి, కృష్ణాజలాలతో సస్యశ్యామలం కానుందన్నారు. జిల్లా ఓటర్లు చైతన్య వంతులని 2015 కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రజలు చూపించిన ప్రేమతో అద్భుత విజయం టీఆర్‌ఎస్‌ సాధించిందన్నారు. అదే చైతన్యం ఎమ్మెల్సీ ఎన్నికలోల కనిపిస్తుందన్నారు. ఖమ్మంలో అద్భుత ప్రగతి జరుగుతుం దన్నారు.   బీజేపీ నేతలు ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. కరోలో కూడా అర్హులైన అందరికి పింఛన్లు, రైతుబంధు, కళ్యాణలక్ష్మి వంటి పథకాలు అమలు జరుగుతుందన్నారు. పేదలు మేలు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతన్నారు. రాష్ట్రంలో హామీ ఇచ్చినట్టుగానే ఉద్యోగాలు కలిపించామని, నిరుద్యోగులకు అనుకున్న మేర న్యాయం చేయలేకపోయామన్నారు. టీఆర్‌ఎస్‌రాష్ట్ర కార్యదర్శి తాతా మధు మాట్లాడుతూ పార్టీ బాధ్యతలు రాష్ట్ర స్థాయిలో కేటీఆర్‌కు అన్నివిధాల అండగా ఉంటున్న పల్లా రాజేశ్వరరెడ్డి విజయం కోసం అందరు కృషి చేద్దామ న్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం పల్లాకే దక్కుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ బలం, పార్టీకేడర్‌ బలం టీఆర్‌ఎస్‌కే ఉందన్నారు. టీఆర్‌ఎస్‌పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి ఆర్‌జేసీ కృష్ణ మాట్లాడుతూ నగరంలో ప్రతి 50 మందికి ఇన్‌చార్జి ఉన్నారని చెప్పారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని పల్లాను గత ఎన్నికల్లో గెలిపించినట్టే ఈసారి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, మేయర్‌ పాపాలాల్‌ , సుడా చైర్మన్‌ విజయ్‌కమార్‌, నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, గ్రంథాలయ చైర్మన్‌ ఖమర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement