కొడాలి నానిపై మంతెన సత్యనారాయణరాజు ఫైర్‌

ABN , First Publish Date - 2021-03-21T23:20:22+05:30 IST

మంత్రి కొడాలి నానిపై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు మండిపడ్డారు. ఆదవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

కొడాలి నానిపై మంతెన సత్యనారాయణరాజు ఫైర్‌

అమరావతి: మంత్రి కొడాలి నానిపై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు మండిపడ్డారు. ఆదవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాగి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించిన మాజీమంత్రి లోకేష్‌ను సంస్కారం లేని హీనులు విమర్శించడం ఏంటి? అని ప్రశ్నించారు. 2004, 2009లో ఎవరి కాళ్లు పట్టుకుని టికెట్ తెచ్చుకున్నావు? అని ప్రశ్నించారు. వెధవల సంఘం ఏర్పాటు చేస్తే నాని ఏకగ్రీవం అవుతాడని మంతెన సత్యనారాయణరాజు ఎద్దేవాచేశారు.

Updated Date - 2021-03-21T23:20:22+05:30 IST