పవన్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వని ప్రభుత్వం: ఎమ్మెల్సీ మాధవ్

ABN , First Publish Date - 2021-10-04T20:41:52+05:30 IST

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సరైన రీతిలో సమాధానం ఇవ్వకుండా...

పవన్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వని ప్రభుత్వం: ఎమ్మెల్సీ మాధవ్

విజయనగరం: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సరైన రీతిలో సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాట్లాడిన పవన్‌పై  మంత్రులు వాదిస్తున్న తీరు పిరికిపంద చర్యగా అభివర్ణించారు. కనీసం క్రిష్టియన్ మతంపై అవగాహన లేని వారికి అప్పటికప్పుడు బాప్టిజం ఇచ్చి స్థానిక పరిషత్ ఎన్నికల్లో నకిలీ సర్టిఫికెట్లు మంజూరు చేశారని ఆరోపించారు. ఇంతవరకు ఐటిడిఎలో ఈ ప్రభుత్వం సాధారణ సమావేశం నిర్వహించకపోవడం గిరిజనులు పట్ల ఉన్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. రాజు ఇంటికే పరిమితం అయినట్లు, ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన ఇంటికే పరిమితమైన దుస్ధితి నెలకొందన్నారు. విశాఖలో ప్రభుత్వ స్థలాలను తాకట్టు పెట్టే దుస్ధితిలో జగన్ ప్రభుత్వం ఉందని ఎమ్మెల్సీ మాధవ్ ఎద్దేవా చేశారు.

Updated Date - 2021-10-04T20:41:52+05:30 IST