Vijayawada : ప్రభుత్వం డే లైట్ రాబరీకి పాల్పడిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్(MLC Madhav) పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల జీపీఎస్(GPS) ఖాతాల నుంచి డబ్బులు దొంగలించిందని పేర్కొన్నారు. గత నవంబర్‌లో కూడా ఇదే విధంగా డబ్బులు మాయమయ్యాయన్నారు. చర్యలు తీసుకోవాల్సిన వారే చోరీకి పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. Cfms ద్వారా తప్పు జరిగిందని చెప్పడాన్ని ఖండిస్తున్నామని మాధవ్ పేర్కొన్నారు. ధర్మవరం ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేశామని ఎమ్మెల్సీ మాధవ్ ఫేర్కొన్నారు.