సైనికుడి కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్సీ కవిత
ABN , First Publish Date - 2021-06-18T01:48:47+05:30 IST
సైనికుడు దాదన్నగారి కళ్యాణ్‌రావు కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్సీ
నిజామాబాద్: సైనికుడు దాదన్నగారి కళ్యాణ్‌రావు కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మాక్లూర్ మండలంలోని వెంకటాపురంలో ఆర్మీ సైనికుడు దాదన్నగారి కళ్యాణ్‌రావు(25) ఆకస్మిక మరణంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కళ్యాణ్ రావు ప్రమాదవశాత్తు మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కళ్యాణ్ రావు కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.