Abn Andhrajyothy Big Debate: కేసీఆర్‌ అంటే బీజేపీ సర్కార్‌కు భయం: ఎమ్మెల్సీ కవిత

ABN , First Publish Date - 2022-08-28T01:44:01+05:30 IST

సీఎం కేసీఆర్ (Cm Kcr) లేని తెలంగాణ లేదని ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన బిగ్ డిబేట్‌లో...

Abn Andhrajyothy Big Debate: కేసీఆర్‌ అంటే బీజేపీ సర్కార్‌కు భయం: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: సీఎం కేసీఆర్ (Cm Kcr) లేని తెలంగాణ లేదని ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన బిగ్ డిబేట్‌లో ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీ (Pm Modi) టార్గెట్ తాను కాదని.. కేసీఆర్ అని అన్నారు. సీబీఐ (CBI), ఈడీ (ED)ని జేబు సంస్థగా బీజేపీ (Bjp) వాడుకుంటోందని కవిత ఆరోపించారు. కేసీఆర్‌ అంటే బీజేపీ సర్కార్‌కు భయమని...అందుకే ఇబ్బంది పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. ‘‘దళితబంధు ప్రజాప్రయోజన పథకమే.  నోటీసులపై ఆధారాలు లేనిదే ఏం మాట్లాడలేం.  కేసులు పెట్టాలనుకుంటే చేయగలిగిందేమీ లేదు. ఈడీ, సీబీఐ లాంటి వ్యవస్థలపై నమ్మకం పోయింది. బీజేపీలో ఉంటే ఈడీ, సీబీఐ దాడులు జరగవు.  మునుగోడులో అమిత్‌షా సభ ఫెయిలైంది.  దాని నుంచి దృష్టి మళ్లించేందుకే బీజేపీ నేతలు ఏవేవో మాట్లాడుతున్నారు. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి ఉంది.  తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ ప్లాన్. ప్రతిపక్షాలు ఎలా ఉండాలన్న విషయాన్ని కూడా వాళ్లు చెబుతున్నారు. కేసీఆర్ ప్రస్తావించిన అంశాలకు మాత్రం ప్రధాని మోదీ సమాధానం చెప్పలేదని కవిత అన్నారు. 



Updated Date - 2022-08-28T01:44:01+05:30 IST