Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 19 Jun 2022 11:17:34 IST

అత్యుత్తమ నాన్నకు Happy Fathers Day : Kalvakuntla Kavitha

twitter-iconwatsapp-iconfb-icon
అత్యుత్తమ నాన్నకు Happy Fathers Day : Kalvakuntla Kavitha

హైదరాబాద్ : సోషల్ మీడియా(Social Media)లో చురుకుగా వ్యవహరించే ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సందర్భానుసారం కుటుంబ అప్యాయతానుబంధాలను నెటిజన్లతో  పంచుకుంటుంటారు. తాజాగా ఫాదర్స్ డే(Fathers day) సందర్భంగా ఆదివారం ట్విటర్ వేదికగా ఆమె స్పందించారు. తన తండ్రి, సీఎం కేసీఆర్‌కు పితృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘అత్యుత్తమ నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే’ అని ఆమె ట్వీట్ చేశారు. ‘ నా జీవితంలో మీరే గొప్ప స్ఫూర్తి’ అంటూ తండ్రిపై ప్రేమను చాటిచెప్పారు. ‘హ్యాపీ ఫాదర్స్ డే’ అని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌తో కలిసి గతంలో దిగిన ఫొటోను ఈ సందర్భంగా ఆమె షేర్ చేశారు. కవిత పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందించారు. హ్యాపీ ఫాదర్స్ డే విషెస్ తెలిపారు. కొన్ని ఆసక్తికరమైన పాత ఫొటోలను షేర్ చేశారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.