అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా కేంద్రం నిర్ణయాలు: కడియం శ్రీహరి

ABN , First Publish Date - 2022-02-02T22:53:59+05:30 IST

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా కేంద్రం నిర్ణయాలు

అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా కేంద్రం నిర్ణయాలు: కడియం శ్రీహరి

హైదరాబాద్‌: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకునే కొత్త రాజ్యాంగం రచించుకోవాల్సిన అవసరం ఉందని మాత్రమే కేసీఆర్‌ అన్నారని ఆయన పేర్కొన్నారు. అసలైన అంబేద్కర్ వారసులం తామేనని, బీజేపీ నేతలు గాడ్సే వారసులని ఆయన తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే కొత్త రాజ్యాంగం కావాలని సీఎం సూచన చేశారని శ్రీహరి పేర్కొన్నారు. 


కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కొత్త రాజ్యాంగం కావాల్సిందేనని, దేశానికి కొత్త రాజ్యాంగం కావాలన్న సంగతి తెలిసిందే. చాలా దేశాలు మార్పులకు అనుగుణంగా వాటి రాజ్యాంగాలను సవరించుకున్నాయన్నారు.. కొత్త రాజ్యాంగంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. ప్రస్తుత రాజ్యాంగాన్ని సవరిస్తే ఉపయోగం లేదన్నారు.. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. ప్రజలు ఆశించినట్లు పాలన జరగడం లేదన్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త రాజ్యాంగం కావాలన్నారు.



Updated Date - 2022-02-02T22:53:59+05:30 IST