Advertisement
Advertisement
Abn logo
Advertisement

అధికార పార్టీ మిల్లర్లకు లొంగిపోయింది: జీవన్ రెడ్డి

కరీంనగర్: అధికారులు, రైస్ మిల్లర్లతో కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. రైతులు ఇబ్బంది పడుతుంటే గంగుల కమలాకర్‌కు బాధ్యత లేదా? రైతులు నష్టపోతుంటే గంగుల కమలాకర్ ఎక్కడికి వెళ్లారు? అని ప్రశ్నించారు. అధికార పార్టీ మిల్లర్లకు లొంగిపోయిందని, రైతుల పక్షాన నిలబడని గంగుల కమలాకర్‌కు మంత్రి పదవి ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. ఆయన శాఖ పని చేసేదే ఈ ఒక్క నెల అని, ధాన్యం కొనకుండా గంగుల కమలాకర్ కనపడకుండా పోయారని విమర్శించారు. 

Advertisement
Advertisement