రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణ ఎడారే: జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-04-12T22:56:22+05:30 IST

రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణ ఎడారిగా మారుతుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఏపీ

రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణ ఎడారే:  జీవన్‌రెడ్డి

హైదరాబాద్‌: రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణ ఎడారిగా మారుతుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతుంటే కేసీఆర్‌ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఏపీ జలదోపిడిని అడ్డుకోలేని కేసీఆర్‌కు సాగర్‌లో ఓటు అడిగే హక్కు లేదని జీవన్‌రెడ్డి  పేర్కొన్నారు.




కాళేశ్వరం నుంచి మూడో టీఎంసీ తరలింపును సాకుగా చూపి రాయలసీమ ఎత్తిపోతల పథకం  చేపడుతున్నారని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నుంచి రెండు టీఎంసీలనే సరిగా వాడుకోలేకపోతున్నామన్నారు. కేవలం కమీషన్ల కక్కుర్తితోనే మూడో టీఎంసీ పనులు చేపట్టారా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏడేళ్లయినా ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయడం లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. కరోనా విజృంభిస్తుంటే సాగర్‌లో కేసీఆర్‌ భారీ సభ పెట్టడం అవసరమా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. 

Updated Date - 2021-04-12T22:56:22+05:30 IST