Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతుల సంక్షేమంలో కేసీఆర్ దేశానికే మార్గదర్శి: Gutta

నల్లగొండ: రైతుల సంక్షేమం విషయంలో సీఎం కేసీఆర్ దేశానికే మార్గదర్శి అని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులకు ప్రధాన కారణం బీజేపీ అని విమర్శించారు. రబీ ధాన్యం ఇంకా 50 శాతం ఎఫ్‌సీఐ గోదాముల్లో ఉందని, కేంద్ర ప్రభుత్వం రైల్వే వ్యాగన్లు ఏర్పాటు చేసి ఆ ధాన్యాన్ని వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణపై కేంద్రం పార్లమెంట్‌లో స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. 10న జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి కోటిరెడ్డి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో గతంలో కంటే స్థానిక సంస్థల ప్రతినిధులందరికీ గౌరవ వేతనం భారీగా పెంచారని, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తుంది కేంద్ర ప్రభుత్వమే అని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

Advertisement
Advertisement