ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

ABN , First Publish Date - 2021-02-27T05:41:19+05:30 IST

మార్చి 14న జరిగే ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ అనుపమ అంజలి అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

 సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి ఆదేశం

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 26 : మార్చి 14న జరిగే ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ అనుపమ అంజలి అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన జోనల్‌, రూట్‌ ఆఫీసర్లు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్‌ ఉంటుందని, రిసెప్షన్‌ కేంద్రం కాకినాడ జేఎన్‌టీయూలో ను, డిస్ర్టిబ్యూషన్‌ కేం ద్రం రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ కా ర్యాలయంలోను ఏర్పా టు చేశామన్నారు. డి విజన్‌ పరిధిలో మొ త్తం 1,906 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. వీరి కోసం గోకవరం, కోరుకొండ, రాజానగరం, కడియం, ఆలమూరు, సీతానగరంలలో ఆయా ఎంపీ డీవో కార్యాలయాల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాజమహేంద్రవరం నగరంలో రెండు పోలింగ్‌ కేంద్రాలు అర్బన్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నామని, గ్రామీణ మండల పరిధిలో హుకుంపేట జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మండలానికి ఒక జోనల్‌, రూటు ఆఫీసరు చొప్పున ముగ్గురు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ను నియమించా మన్నారు. శాంతిభద్రతలు, బందోబస్తు ఏర్పాట్లు పోలీసు అధికారులు చేపట్టాలన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా యంత్రాంగానికి కలెక్టర్‌ అభినందనలు తెలిపారని, అదే స్ఫూర్తితో ఎమ్మెల్సీ ఎన్నిక లు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు జేవీ సంతోష్‌, రవికుమార్‌, శ్రీలత, వెంకటేశ్వరరావు, బాలచంద్రరెడ్డి, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-02-27T05:41:19+05:30 IST