ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టండి

ABN , First Publish Date - 2021-02-27T04:56:47+05:30 IST

ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టండి

ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టండి
ఆదిభట్ల : సమావేశంలో మాట్లాడుతున్న శేఖర్‌రావు

  • జాతీయ ఖాదీ బోర్డు సభ్యుడు పేరాల శేఖర్‌రావు  
  • ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో నాయకులు 

ఆదిభట్ల/షాద్‌నగర్‌అర్బన్‌/చౌదరిగూడ: విద్యార్థి, ఉద్యోగ, రైతులు, కార్మికులు ఇలా అందరి సమస్యలపై స్పందించి పోరాడే వ్యక్తి రాంచందర్‌రావు అని, ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని జాతీయ ఖాదీ బోర్డు సభ్యుడు, ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి పేరాల శేఖర్‌రావు కార్యకర్తలకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిభట్ల మున్పిపాలిటీ పరిధి బొంగ్లూరు కళ్లెం జంగారెడ్డి గార్డెన్‌లో శుక్రవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీజేజీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బీజేపి నియోజక వర్గ ఎన్నికల ఇన్‌చార్జి పోరెడ్డి అర్జున్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో శేఖర్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నించే తనను మరోమారు గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బొక్క నర్సింహారెడ్డి,  కొప్పు భాషా, గోగిరెడ్డి లచ్చిరెడ్డి, మర్పల్లి అంజయ్యయాదవ్‌, కొత్త అశోక్‌గౌడ్‌, బోసుపల్లి ప్రతాప్‌, ముత్యాల భాస్కర్‌, కళ్లెం బాల్‌రెడ్డి, సుమతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాంచందర్‌రావును గెలిపించాలని ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి జనార్ధన్‌రెడ్డి కోరారు. ఫరూఖ్‌నగర్‌ మండలంలోని మొగిలిగిద్దలో శుక్రవారం పట్టభద్రులను ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా జనార్ధన్‌రెడ్డిని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి వెంకటే్‌షగుప్త సన్మానించారు. అదేవిధంగా షాద్‌నగర్‌లోని పట్టభద్రులను కలిసి ప్రచారం చేశారు. చౌదరిగూడలో బీజేపీ నాయకులు రాంచందర్‌రావును గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. 


కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలి

చేవెళ్ల/కొందుర్గు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సమవర్థవంతమైన నాయకుడైన మాజీ, మంత్రి డాక్టర్‌ చిన్నారెడ్డిని ఎన్నికలబరిలో నిలిపినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఓటమి భయంతోనే మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురును ఎన్నికల బరిలో నిలిపి వారి కుటుంబాన్ని అగౌరవపరిచేందుకు సీఎం నిర్ణయించుకున్నారని వాపోయారు. కొందుర్గులో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వీర్లపల్లి శంకర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. మండల పరిధిలోని రేగడి చిల్కమర్రిలో పట్టభద్రులను కలిసి చిన్నారెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థించారు. 


కాంగ్రెస్‌ సభను విజయవంతం చేయాలి

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్‌ స్థాయిలో నిర్వహించే కాంగ్రెస్‌ సభను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. చేవెళ్లలోని కేజీఆర్‌ గార్డెన్‌లో ఆదివారం ఉదయం 11గంటలకు కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. సభకు ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ చిన్నారెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌, పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు.   


ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకమే..

షాద్‌నగర్‌అర్బన్‌: ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారు లేకపోతే ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని రాజకీయ తెలంగాణ ఫ్రంట్‌ చైర్మన్‌ వీజీఆర్‌ నారగోని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరి సతీ్‌షను గెలిపించాలని శుక్రవారం షాద్‌నగర్‌లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది శ్రీనివా్‌సయాదవ్‌, రాజకీయ తెలంగాణ ఫ్రంట్‌ రాష్ట్ర ప్రచార కన్వీనర్‌ జగన్‌మోహన్‌ ముదిరాజ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-27T04:56:47+05:30 IST