Mlc స్థానానికి ఆగస్టు 11న ఉప ఎన్నిక

ABN , First Publish Date - 2022-07-19T17:17:03+05:30 IST

శాసనసభ నుంచి విధానపరిషత్‌కు ఎన్నికైన కాంగ్రెస్‌ సభ్యుడు ఇబ్రహీం రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఆగస్టు 11న ఉప ఎన్నిక

Mlc స్థానానికి ఆగస్టు 11న ఉప ఎన్నిక

బెంగళూరు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): శాసనసభ నుంచి విధానపరిషత్‌కు ఎన్నికైన కాంగ్రెస్‌ సభ్యుడు ఇబ్రహీం రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఆగస్టు 11న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది. 2024 జూన్‌ 17వరకు అవధి కల్గిన ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక కోసం ఈనెల 25న నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. అదే రోజు నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమై ఆగస్టు 1వరకు కొనసాగుతుంది. మరుసటి రోజు వీటిని పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఆగస్టు 4వరకు గడువు ఉంటుంది. అవసరమైతే ఆగస్టు 11న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పో లింగ్‌ నిర్వహిస్తారు. శాసనసభలో ఉన్న బలం దృష్ట్యా అధికార బీజేపీ ఈ స్థానాన్ని సులభంగా కైవసం చేసుకోవచ్చునని భావిస్తున్నారు. 

Updated Date - 2022-07-19T17:17:03+05:30 IST